Mahesh Babu: హాట్ టాపిక్ .. ముగ్గురు దర్శకులతో మహేశ్ బాబు చర్చలు

షార్ట్స్‌లో చూడండి
మహేశ్ బాబు 25వ సినిమాగా 'మహర్షి' రూపొందుతోంది. కొన్ని రోజులుగా పొల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుంటూ వస్తోన్న ఈ సినిమా, తాజాగా అక్కడి షెడ్యూల్ ను పూర్తి చేసి హైదరాబాద్ కి తిరిగి వచ్చింది. తదుపరి షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. వచ్చేవారం నుంచి ఈ షెడ్యూల్ షూటింగ్ మొదలుకానుంది. షూటింగుకి వారం రోజుల సమయం ఉండటంతో, మహేశ్ బాబు నుంచి ముగ్గురు దర్శకులకు కబురు వెళ్లిందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

ముందుగా ఆయనను సుకుమార్ కలవనున్నట్టు తెలుస్తోంది. మహేశ్ బాబు తదుపరి సినిమా సుకుమార్ తో ఉందనే సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన ఫైనల్ స్క్రిప్ట్ ను సుకుమార్ .. మహేశ్ బాబుకి వినిపిస్తాడని అంటున్నారు. ఆ తరువాత దర్శకుడు అనిల్ రావిపూడి .. మహేశ్ బాబును కలుసుకుని, ఆయన కోసం తాను సిద్ధం చేసిన కథను వినిపిస్తాడని సమాచారం. ఇక 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ రెడ్డి కూడా కలిసి మహేశ్ బాబుకి స్క్రిప్ట్ వినిపించనున్నాడని చెబుతున్నారు. ఈ ఇద్దరు దర్శకులు మహేశ్ ను ఒప్పిస్తే .. సుకుమార్ తరువాత వాళ్లు లైన్లో వున్నట్టే.
Go Back to Shorts
Mahesh Babu
sukumar
anil
sandeep

More Telugu News