Chandrababu: సంక్షేమ పథకాలపై అధికారులతో నేడు చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌

షార్ట్స్‌లో చూడండి
సంక్షేమ పథకాలు, జన్మభూమిలో వచ్చిన ఫిర్యాదులు, చంద్రన్న బీమా, పెళ్లికానుక, యువనేస్తం, అన్నక్యాంటీన్లు, గృహనిర్మాణం తదితర అంశాలపై చర్చించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ల నుంచి మండల స్థాయి అధికారుల వరకు అంతా పాల్గొనాలని ఆదేశాలు అందాయి.

ఉదయం 10 గంటల తర్వాత నిర్వహించే ఈ సమావేశంలో ప్రధానంగా 9 సంక్షేమ పథకాలపై చర్చించనున్నారు. అలాగే మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహిస్తారు. బడ్జెట్‌ రూపకల్పన, గవర్నర్‌ ప్రసంగంపై చర్చిస్తారు. సాయంత్రం 4 గంటలకు పోలవరం, సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్ష జరుపుతారు.
Go Back to Shorts
Chandrababu
vedioconference
amaravathi

More Telugu News