మా నాన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్: దర్శకుడు అనిల్ రావిపూడి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మా నాన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్: దర్శకుడు అనిల్ రావిపూడి

  • మాది ఓ సాధారణమైన కుటుంబం
  • నా సినిమా రిలీజ్ అంటే నాన్న హడావిడి చేస్తాడు
  • నలుగురితో ఆనందాన్ని పంచుకుంటాడు   
దర్శకుడు అనిల్ రావిపూడి 'పటాస్'తో తన సత్తాచాటుకున్నాడు. అప్పటి నుంచి ఆయన సినిమాలు ఒక దానికి మించి ఒకటి హిట్ అవుతున్నాయి. విభిన్నమైన కథాంశాలను తెరకెక్కిస్తూ ఆయన తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. అలాంటి ఆయన ఐడ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .."మా నాన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ .. ఓ సాధారణమైన కుటుంబం నుంచి నేను వచ్చాను.

పదవీ విరమణ చేసిన ఆయన, ఒక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా నన్ను చూసి పొందుతోన్న ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. పొద్దున్నే ఆయన పేపర్ చూస్తాడు .. అందులో నా సినిమా న్యూస్ వుంటే ఆ పేపర్ ను దాచుకుంటాడు. ఊరి సెంటర్లో నా సినిమా ఫ్లెక్సీ ఏర్పాటు చేసి మురిసిపోతాడు. సినిమా రిలీజ్ కి నాలుగు రోజుల ముందు నుంచే హడావిడి చేసి, అందరితో కలిసి వెళ్లి సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తాడు. నా సినిమా ఎలా వుందనేది చుట్టుపక్కల వాళ్లకి చెబుతూ ఆనందిస్తాడు. టీవీల్లో నా ఇంటర్వ్యూలు చూసి సంతోషిస్తాడు" అని చెప్పుకొచ్చాడు. 
anil ravipudi

More Telugu News