రాజమౌళి సినిమాలో ఛాన్స్ అంటే ఎవరు కాదంటారు?: సముద్రఖని
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజమౌళి సినిమాలో ఛాన్స్ అంటే ఎవరు కాదంటారు?: సముద్రఖని

  • రాజమౌళితో టచ్ లో వున్నాను
  • ఇంటికి ఆహ్వానించారు
  • పిలిచి మరీ వేషం ఇచ్చారు    
రాజమౌళి దర్శకత్వంలో ఒక చిన్నవేషం పడినా చాలు అనుకునే నటీనటులు చాలామంది వున్నారు. ఎందుకంటే చిన్న పాత్రలే అయినా రాజమౌళి వాటిని మలిచే పద్ధతి వేరు .. అవి తీసుకొచ్చే గుర్తింపు వేరు. అందువలన అంతా ఆయన సినిమాలో చేయాలనే ఆసక్తిని కనబరుస్తూ వుంటారు. అలాంటి రాజమౌళి సినిమాలో తమిళ నటుడు .. దర్శకుడు సముద్రఖని ఒక కీలకమైన రోల్ ను దక్కించుకున్నారు. ఆల్రెడీ కొన్ని రోజుల క్రితమే ఈ విషయం బయటికి వచ్చింది.

తాజాగా తమిళ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సముద్రఖని ఈ విషయాన్ని గురించే ప్రస్తావించారు. "కొన్ని సంవత్సరాల క్రితం నేను దర్శకత్వం వహించిన 'నాడోడిగళ్' సినిమా చూసి .. అభినందిస్తూ రాజమౌళి ఒక మెసేజ్ పెట్టారు. అప్పటి నుంచి నేను ఆయనకి టచ్ లో ఉంటూ వస్తున్నాను. ఈ మధ్య ఆయన నన్ను తన ఇంటికి ఆహ్వానించి .. కుటుంబ సభ్యులందరినీ పరిచయం చేశారు. 'ఆర్ ఆర్ ఆర్' సినిమాను గురించి మాట్లాడుతూ .. 'ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర వుంది చేస్తారా?' అని రాజమౌళి అడిగారు. రాజమౌళి ఛాన్స్ ఇస్తానంటే ఎవరు కాదంటారు? అందుకే ఎంతమాత్రం ఆలోచించకుండా వెంటనే ఒప్పేసుకున్నాను" అని చెప్పుకొచ్చారు.
samudrakhani

More Telugu News