సరిహద్దుల్లో యాక్షన్ కి దిగిపోయిన గోపీచంద్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సరిహద్దుల్లో యాక్షన్ కి దిగిపోయిన గోపీచంద్

  • స్పై థ్రిల్లర్ నేపథ్యంలో గోపీచంద్ 
  • యాక్షన్ ఎపిసోడ్ తో మొదలెట్టిన తిరు
  •  మే నెలలో విడుదల చేసే ఆలోచన    
తిరు దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా స్పై థ్రిల్లర్ నేపథ్యంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో గోపీచంద్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. ఇండో - పాక్ సరిహద్దుల్లో ఈ రోజునే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. అక్కడ యాక్షన్ ఎపిసోడ్ ను తిరు తనదైన తరహాలో చిత్రీకరించనున్నాడు.

 ఫ్యామిలీ ఎంటర్టైనర్లు చేసినా .. గోపీచంద్ కి యాక్షన్ హీరోగానే మంచి క్రేజ్ వుంది. ఇంతవరకూ ఆయన చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ కి పూర్తి భిన్నంగా ఈ సినిమాలోని యాక్షన్ సీన్ ఉంటుందని అంటున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలిచిపోతుందని చెబుతున్నారు. అనిల్ సుంకర నిర్మిస్తోన్న ఈ సినిమాను మే నెలలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. కొంతకాలంగా హిట్ కోసం వెయిట్ చేస్తోన్న గోపీచంద్ కి, ఈ సినిమాతోనైనా హిట్ దొరుకుతుందేమో చూడాలి
gopichand

More Telugu News