పారితోషికాన్ని ఐదు కోట్లకు పెంచేసిన అనిల్ రావిపూడి?
- వరుస విజయాల అనిల్ రావిపూడి
- సంక్రాంతి బరిలో విజేతగా నిలిచిన 'ఎఫ్ 2'
- ఉత్సాహాన్ని చూపుతోన్న హీరోలు
ఈ నేపథ్యంలో చాలామంది స్టార్ హీరోలు అనిల్ రావిపూడితో సినిమాలు చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. యువ హీరోలైతే పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి తన డిమాండ్ కి తగినట్టుగా పారితోషికం పెంచేసినట్టు ఫిల్మ్ నగర్లో ఒక టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకూ సినిమాకి 3 కోట్ల వరకూ తీసుకుంటూ వచ్చిన ఆయన, 5 కోట్లకి పైగా తన పారితోషికాన్ని ఫిక్స్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఆయన తాజా చిత్రానికి సంబంధించిన విషయాలు తెలియనున్నాయి.