రజనీకి అసలు సిసలు హిట్ .. 150 కోట్ల క్లబ్ లో 'పేట'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రజనీకి అసలు సిసలు హిట్ .. 150 కోట్ల క్లబ్ లో 'పేట'

  • ఈ నెల 10న థియేటర్లకు వచ్చిన 'పేట'
  • సంక్రాంతి ముందునుంచే మొదలైన సందడి
  • రజనీ లుక్ .. మాస్ కంటెంట్ ప్రధాన బలం  
ప్రపంచవ్యాప్తంగా రజనీకాంత్ కి అభిమానులు వున్నారు. ఇక తమిళనాట ఆయన సినిమా విడుదలవుతుందీ అంటే, పండుగలన్నీ ఒక్కసారిగా వచ్చేసిన సందడి కనిపిస్తుంది. అలా ఇప్పుడు తమిళనాట థియేటర్లలో 'పేట' సందడి చేస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 10వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, వారం రోజుల్లో 150 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. బడ్జెట్ పరంగా చూసుకుంటే ఈ మధ్య కాలంలో రజనీకాంత్ కి దక్కిన అసలు సిసలు హిట్ ఇదేననే టాక్ కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. రజనీకాంత్ మరింత యంగ్ గా .. స్టైలీష్ గా కనిపించడం, మాస్ కంటెంట్ పుష్కలంగా ఉండటం .. ఆడియో సక్సెస్ కావడం ఈ సినిమాకి ఈ స్థాయి విజయం దక్కడంలో ప్రధానమైన పాత్రను పోషించాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
rajani
simran
trisha

More Telugu News