చరణ్ గొప్ప డాన్సర్ .. చిరంజీవి గారి నుంచే అది వచ్చింది: స్నేహ
Add ap7am to your home Screen

చరణ్ గొప్ప డాన్సర్ .. చిరంజీవి గారి నుంచే అది వచ్చింది: స్నేహ

  • చరణ్ చాలా సింపుల్ గా ఉంటాడు
  • అందరినీ ఎంతో గౌరవిస్తాడు 
  • ఆర్టిస్టులందరితోను ఒకేలా వుంటాడు    
అందం .. అభినయం కలగలిసిన కథానాయికగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి స్నేహ మంచి మార్కులు కొట్టేసింది. అలాంటి స్నేహ రీ ఎంట్రీ సక్సెస్ ఫుల్ గా సాగిపోతోంది. తాజాగా ఆమె 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ చరణ్ గురించి ప్రస్తావించారు. 'వినయ విధేయ రామ' సినిమాలో చరణ్ వదినగా నటించాను. మెగాస్టార్ తనయుడు .. ఎలా వుంటారో ఏంటోనని ఫస్టు డే అనుకున్నాను.

సెట్లో చరణ్ చాలా సింపుల్ గా ఉంటాడు .. అందరితోను కలిసిపోతాడు. పెద్ద ఆర్టిస్టులు .. చిన్న ఆర్టిస్టులు అనే తేడాను ఆయన ఎంతమాత్రం చూపించడు. అందరినీ గౌరవిస్తూ ఆయన చాలా ఆప్యాయంగా మాట్లాడతాడు. ఆయనలోని ఆ మంచి లక్షణం నాకు బాగా నచ్చింది. ఏ సీన్ అయినా డైరెక్టర్ చెప్పగానే వెంటనే పట్టేస్తాడు. ఆయన చాలా గొప్ప డాన్సర్ .. డాన్స్ లో ఆ జోష్ ఆయనకి చిరంజీవి గారి నుంచే వచ్చి ఉంటుంది" అని చెప్పుకొచ్చారు. 
sneha
ali

More Telugu News