KTR: కేటీఆర్ తో భేటీపై వైసీపీ ట్వీట్!

షార్ట్స్‌లో చూడండి
నేడు జరగనున్న వైఎస్ జగన్, కేటీఆర్ భేటీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. "ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ కానున్నారు" అని తన అధికార ట్విట్టర్ లో వ్యాఖ్యానించింది. కేటీఆర్ తో పాటు టీఆర్ఎస్ ఎంపీ వినోద్‌ కుమార్‌, పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రావణ్ కుమార్‌ రెడ్డిలు కేసీఆర్ ఆదేశాలతో నేడు జగన్ ను కలిసి చర్చించనున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌, బీజేపీలకు వ్యతిరేకంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు కృషి చేస్తున్న కేసీఆర్, ఇప్పటికే మమతా బెనర్జీ, నవీన్‌ పట్నాయక్‌, అఖిలేశ్‌ యాదవ్‌ తదితరులతో చర్చలు జరిపారు.



Go Back to Shorts
KTR
Jagan
Twitter
YSRCP

More Telugu News