'గుండమ్మ కథ' స్ఫూర్తితో 'ఎఫ్ 2' చేశాను : అనిల్ రావిపూడి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'గుండమ్మ కథ' స్ఫూర్తితో 'ఎఫ్ 2' చేశాను : అనిల్ రావిపూడి

  • 'గుండమ్మకథ' అంటే ఇష్టం
  • వెంకీ ఆసనానికి అద్భుతమైన రెస్పాన్స్ 
  • సీక్వెల్ చేయాలనే ఆలోచన వుంది  
వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన 'ఎఫ్ 2' .. సంక్రాంతి కానుకగా మొన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆటతోనే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని, విడుదలైన అన్ని ప్రాంతాల్లో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ .." చిన్నప్పటి నుంచి కూడా నాకు 'గుండమ్మ కథ' సినిమా అంటే ఇష్టం. ఆ సినిమా స్ఫూర్తితోనే ఈ సినిమా చేశాను.

'గుండమ్మ కథ'లోని సూర్యకాంతం పాత్రను ఇందులో 'ప్రగతి'తో చేయించాము. ఇక నాకు సినిమాలపై ఆసక్తి ఏర్పడిన దగ్గర నుంచి, నాపై జంధ్యాల.. ఈవీవీ సత్యనారాయణ .. ఎస్వీ కృష్ణారెడ్డి ప్రభావం వుంది. వాళ్ల తరహాలో హాయిగా నవ్వించే సినిమాలు తీయాలని అనుకుంటూ ఉండేవాడిని. 'ఎఫ్ 2' సినిమా ద్వారా కొంతవరకూ ప్రయత్నించగలిగాను. వెంకీ ఆసనానికి థియేటర్స్ లో వస్తోన్న రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా సక్సెస్ టాక్ ను తెచ్చుకున్నందుకు చాలా సంతోషంగా వుంది. ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచన కూడా వుంది" అని చెప్పుకొచ్చారు. 
anil ravipudi

More Telugu News