BJP: బీజేపీ ఆదేశిస్తే పోటీ చేస్తానంటున్న సినీనటుడు కృష్ణంరాజు

బీజేపీ నేత, ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే కనుక రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. మోదీయే మళ్లీ ప్రధాని కావాలని తాను కోరుకుంటున్నానని, ప్రజల్లో ఆయనకు మద్దతు మరింతగా పెరుగుతోందని అన్నారు. ప్రజా సేవకుడంటే మోదీలా ఉండాలని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఈబీసీలకు పది శాతం రిజర్వేషన్ల బిల్లు గురించి ప్రస్తావించారు. ఈ బిల్లుకు ఆమోదం లభించడంపై అన్ని వర్గాల నుంచి అభినందనలు వస్తున్నాయని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం నిమిత్తం కేంద్రం నుంచి నిధులు విడుదల చేస్తున్నా, రావట్లేదని కొందరు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
BJP
Tollywood
Krishnamraju
modi
pm

More Telugu News