గుంటూరు సీటు ఇవ్వండి: టీడీపీతో హాస్య నటుడు అలీ
- 20 ఏళ్లుగా టీడీపీలోనే ఉన్నా
- పవన్ కల్యాణ్ ఆహ్వానించలేదు
- వైకాపాలో చేరనున్నానన్న వార్తలు అవాస్తవం
- మంత్రి గంటాతో అలీ
తాను మర్యాదపూర్వకంగానే జగన్, పవన్ లను కలిశానని అన్నారు. తాను చంద్రబాబును కూడా కలిసి, గుంటూరు నుంచి పోటీ చేసే విషయమై మాట్లాడగా, ఆయన భరోసా ఇచ్చారని, మీ తరఫున సహకారం కావాలని గంటాతో భేటీలో అలీ చెప్పినట్టు సమాచారం. గతంలో గంటా ఎన్నికల్లో పోటీ చేసిన వేళ, అలీ స్వయంగా వెళ్లి విస్తృతంగా ప్రచారం చేశారు.