ఏపీ మంత్రి గంటాతో హాస్య నటుడు అలీ భేటీ
- గంటాతో పలు విషయాలపై చర్చించిన అలీ
- ఇప్పటికే టీడీపీ, జనసేన అధినేతలను కలిసిన అలీ
- ఏ పార్టీలో చేరతారన్న విషయంలో సందిగ్ధం
ఈ క్రమంలో తాజాగా, ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుని అలీ కలిశారు. ఆయనతో పలు విషయాలపై చర్చించినట్టు సమాచారం. కాగా, రేపటితో జగన్ పాదయాత్ర ముగియనుంది. ఈ సందర్భంగా జగన్ సమక్షంలో వైసీపీ కండువాను అలీ కప్పుకుంటారన్న వార్తలు వెలువడ్డాయి. కానీ, టీడీపీ, జనసేన అధినేతలను అలీ ఇప్పటికే కలవడంతో ఆయన ఏ పార్టీలో చేరతారన్న విషయంలో సందిగ్ధం నెలకొంది.