సినిమా మాఫియాను షూట్ చేయాలన్న వల్లభనేని అశోక్.. తీవ్రంగా స్పందించిన నిర్మాత బన్నీ వాస్!
- అశోక్ గ్రూపునకు చెందిన ప్రసన్నకు వార్నింగ్
- సహనం కోల్పోయే పరిస్థితి తీసుకొస్తున్నారని వ్యాఖ్య
- థియేటర్లు దొరక్కపోవడంతో తీవ్ర వ్యాఖ్యలు చేసిన వల్లభనేని అశోక్
వల్లభనేని అశోక్ సన్నిహితుడైన నిర్మాత ప్రసన్నకుమార్ ను ఉద్దేశించి ఈరోజు ఫేస్ బుక్ లో స్పందిస్తూ ‘ప్రసన్న గారు.. తమరు తెలిసీ తెలియని మిడిమిడి జ్ఞానంతో మాటలు జారుతున్నారు. మేము సహనం కోల్పోయే పరిస్థితికి తీసుకొస్తున్నారు. తిట్టాలి అనుకుంటే మేము సంస్కారం అనే హద్దుని దాటడం మాత్రమే మిగిలింది’ అని ట్వీట్ చేశారు.
ఈనెల 9న బాలకృష్ణ నటించిన 'ఎన్టీఆర్ - కథానాయకుడు', 11న రామ్ చరణ్ 'వినయ విధేయ రామ'లు విడుదల కానున్నాయి. దీంతో 80 శాతానికి పైగా థియేటర్లలో ఈ రెండు సినిమాలే ఆడనున్నాయి. ఈ నేపథ్యంలో పేట సినిమాను జనవరి 10న రిలీజ్ చేసేందుకు వల్లభనేని అశోక్ ప్లాన్ చేసుకున్నారు. అయితే సినిమా విడుదలకు థియేటర్లు అందుబాటులో లేకుండా పోవడంతో మనస్తాపానికి లోనైన వల్లభనేని అశోక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.