Jagan: చేసేది మాత్రమే చెబుతా... చెప్పింది చెయ్యకుంటే రాజీనామా చేస్తా: జగన్

షార్ట్స్‌లో చూడండి
చంద్రబాబు నాయుడి మాదిరిగా, కులానికి ఓ పేజీ చొప్పున తప్పుడు హామీలతో ఓ పుస్తకంలా మేనిఫెస్టోను తాను ప్రకటించలేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. సాక్షి టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, వైకాపా మేనిఫెస్టో కేవలం ఒకటి లేదా రెండు పేజీల్లో మాత్రమే ఉంటుందని అన్నారు. తాను చేయగలిగిన విషయాలను మాత్రమే అందులో పొందుపరుస్తానని, వాటిని చేయలేకపోతే, తాను రాజీనామా చేస్తానని చెప్పారు.

మాట ఇచ్చిన తరువాత దాన్ని నెరవేర్చడం అన్న విషయం తన రక్తంలోనే ఉందని, చేయలేకపోయినప్పుడు, దాని గురించి చెప్పకూడదని అన్నారు. తన ఎన్నికల ప్రణాళిక చాలా స్పష్టంగా, అమలు చేయగలిగేలా మాత్రమే ఉంటుందని, ఓ చరిత్రను సృష్టించేలా పాలన చేయాలన్నది తన ఆకాంక్షని జగన్ వ్యాఖ్యానించారు. దేవుడు ఆశీర్వదించి, తనతో మంచిని చేయించాలని ఆశిస్తే, తాను అధికారంలోకి వస్తానని అన్నారు. చంద్రబాబులా నేడెంత సంపాదించాలి? రేపెంత సంపాదించాలి? ఏ ప్రాజెక్టులో ఎంత కమీషన్ నొక్కేయాలని తాను లెక్కలు కట్టబోనని చెప్పారు. 
Go Back to Shorts
Jagan
Manifesto
YSRCP
Chandrababu

More Telugu News