సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • రాయ్ లక్ష్మి 'వెంకట లక్ష్మి' అప్ డేట్ 
  • రికార్డ్ సృష్టించిన తెలుగు పాట
  • తమిళంలో తెలుగు సినిమా రీమేక్    
*  రాయ్ లక్ష్మి ప్రధాన పాత్రధారిగా నూతన దర్శకుడు కిషోర్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'వేర్ ఈజ్ ది వెంకట లక్ష్మి' చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
*  వరుణ్ తేజ్, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'ఫిదా' చిత్రంలోని 'వచ్చిండే..' పాట ఎంతగా హిట్టయిందో మనకు తెలుసు. ఇప్పుడీ పాట యూట్యూబ్ లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. 173 మిలియన్ల వ్యూస్ తో ఈ పాట దక్షిణాదిన రికార్డుగా నిలిచింది.
*  తమిళం నుంచి తెలుగులోకి ఎక్కువగా సినిమాలు రీమేక్ అవుతుంటాయి. అయితే, తాజాగా ఓ తెలుగు చిత్రాన్ని తమిళంలోకి రీమేక్ చేస్తున్నారు. ఆమధ్య శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో వచ్చిన 'హుషారు' చిత్రాన్ని ఇప్పుడు వీవీ కదిర్ దర్శకత్వంలో తమిళంలో రీమేక్ చేస్తుండడం విశేషం.
Go Back to Shorts
Rai Lakshmi
Varuntej
Saipallavi
shekhar

More Telugu News