డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ లో పాల్గొంటున్న రాజశేఖర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ లో పాల్గొంటున్న రాజశేఖర్!

  • షూటింగు దశలో 'కల్కి'
  • 1983 నాటి నేపథ్యంలో సాగే కథ 
  • పోలీస్ ఆఫీసర్ గా రాజశేఖర్
మొదటి నుంచి కూడా రాజశేఖర్ యాక్షన్ చిత్రాలకి పెట్టింది పేరు. చాలాకాలం తరువాత 'గరుడవేగ' సినిమాతో హిట్ కొట్టిన ఆయన, ఆ ఉత్సాహంతో మరో యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'కల్కి' పేరుతో ఈ సినిమా రూపొందుతోంది. 1983 నాటి నేపథ్యంలో సాగే ఈ కథలో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రీసెంట్ గా 7 నిమిషాల నిడివి కలిగిన ఒక యాక్షన్ సీన్ ను రాజశేఖర్ పై చిత్రీకరించారట. రిస్కీ సీన్ అయినప్పటికీ రాజశేఖర్ ఎంతమాత్రం ఆలోచించకుండా .. డూప్ లేకుండా సింగిల్ టేక్ లో ఈ సీన్ చేశారని చెబుతున్నారు. ఈ సీన్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. కొన్ని రోజుల క్రితం ఇదే సినిమా యాక్షన్ సీన్స్ చిత్రీకరణలో రాజశేఖర్ గాయపడిన సంగతి తెలిసిందే. అయినా ఆయన మళ్లీ డూప్ లేకుండా రిస్క్ చేస్తుండటం విశేషం.
rajasekhar
prashanth varma

More Telugu News