తెలుగులో 'పేట' విడుదలకి రంగం సిద్ధం
- కార్తీక్ సుబ్బరాజ్ నుంచి రానున్న 'పేట'
- రజనీ సరసన సిమ్రాన్ .. త్రిష
- జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు
తాజాగా తెలుగు వెర్షన్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా, యు/ఎ సర్టిఫికేట్ ను సొంతం చేసుకుంది. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రజనీ లుక్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. దర్శకుడిగా కార్తిక్ సుబ్బరాజ్ కి గల ఇమేజ్ కూడా ఈ సినిమా పట్ల క్రేజ్ పెరగడానికి కారణమైంది. ఇక రజనీ సరసన సిమ్రాన్ .. త్రిష కనిపించనుండటం కూడా ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంక్రాంతి బరిలో ఈ సినిమా సందడి ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి మరి.