మోదీని ఒప్పిస్తానని కేసీఆర్ అన్నారు.. ఏమైంది?: షబ్బీర్ అలీ
Add ap7am to your home Screen

మోదీని ఒప్పిస్తానని కేసీఆర్ అన్నారు.. ఏమైంది?: షబ్బీర్ అలీ

  • ముస్లిం రిజర్వేషన్లకు కేంద్రం సహకరించదని చెప్పాం
  • మోదీని ఒప్పించి, రిజర్వేషన్లు తెస్తామని కేసీఆర్ అన్నారు
  • బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను కల్పించినది కాంగ్రెస్  
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వి అన్నీ కోతలేనని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కేసీఆర్ చెప్పారని... ముస్లిం రిజర్వేషన్లకు కేంద్రం సహకరించదని తాము పదేపదే చెప్పామని... మోదీని ఒప్పిస్తామంటూ కేసీఆర్ చెప్పారని అన్నారు. ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించిన హామీ ఏమైందని ప్రశ్నించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను కల్పించిన ఘనత కాంగ్రెస్ దని అన్నారు. ఒక్క ఆర్డినెన్స్ తో బీసీల రిజర్వేషన్లను 22 శాతానికి తగ్గించిన చరిత్ర టీఆర్ఎస్ దని చెప్పారు. 
modi
Shabbir Ali
kct
TRS
congress
bjp

More Telugu News