న్యాయమూర్తులను సైతం చంద్రబాబు తప్పుదోవ పట్టించారు!: కన్నా లక్ష్మీనారాయణ
- నాడు సచివాలయం ఉద్యోగులను తప్పుదోవపట్టించారు
- నేడు హైకోర్టు ఉద్యోగులను, రోడ్లపైకి తెచ్చారు
- భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని ఇచ్చిన హామీ నెరవేరలేదు
గత ఏడాది డిసెంబర్ 15వ తేదీ కల్లా హైకోర్టు భవనాలు సిద్ధమంటూ సుప్రీంకోర్టుకు చంద్రబాబు ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చిందని, ఏపీలో హైకోర్టు భవనాలు అద్భుతంగా నిర్మిస్తున్నామంటూ ఢిల్లీలో సైతం గ్రాఫిక్స్ నమూనా భవనాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ప్రదర్శించారని విమర్శించారు. ప్రస్తుతం అక్కడ బురద, ఏమాత్రం సిద్ధంగా లేని భవనాలు ఉన్నాయని, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను సైతం తప్పుదోవ పట్టించిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.