సుధీర్ .. రష్మీ మధ్య అలాంటిదేం లేదు: గెటప్ శీను
- సుధీర్ .. రష్మీ మధ్య కామెడీ ట్రాక్ పెట్టాము
- జనం ఎంజాయ్ చేస్తున్నారని ఆ ట్రాక్ ను కొనసాగించాం
- ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టేయండి
'జబర్దస్త్' కామెడీ షో కోసమే సుధీర్ .. రష్మీ మధ్య ఒక చిన్న ట్రాక్ పెట్టాము. జనాలు ఎంజాయ్ చేస్తున్నారు కదా అని ఆ ట్రాక్ ను అలా కంటిన్యూ చేశాము. అప్పటి నుంచే వాళ్లిద్దరి మధ్యా ఏదో ఉందంటూ రూమర్స్ మొదలయ్యాయి. నిజానికి వాళ్లిద్దరి మధ్యా ఎలాంటి సంబంధం లేదు. వాళ్లిద్దరూ నెలకి ఒకసారి కూడా ఫోన్ చేసుకోరనే విషయం మాకు తెలుసు. ఈ రూమర్స్ కారణంగా అటు సుధీర్ ఫ్యామిలీలోని వాళ్లు .. ఇటు రష్మీ ఫ్యామిలీలోని వాళ్లు చాలా బాధపడుతున్నారు. సుధీర్ .. రష్మీ మధ్య ఏదో ఉందనుకునేవారు ఇక ఆ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టేయండి" అని ఆయన చెప్పుకొచ్చాడు.