'పేట' నుంచి స్పెషల్ గా తెలుగు ట్రైలర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'పేట' నుంచి స్పెషల్ గా తెలుగు ట్రైలర్

  • రజనీకాంత్ హీరోగా రానున్న 'పేట'
  • మరింత యంగ్ గా .. స్టైలిష్ గా రజనీ 
  • ఒకే రోజున రెండు భాషల్లో విడుదల  
కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా 'పేట' రూపొందింది. తమిళంతోపాటు తెలుగులోను ఈ సినిమాను జనవరి 10వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల తమిళ ట్రైలర్ ను రిలీజ్ చేసిన టీమ్, తాజాగా తెలుగులోను స్పెషల్ ట్రైలర్ ను వదిలారు.

"చూడబోతున్నారుగా .. కాళి ఆట. ఈ సంక్రాంతికి ప్రతి ఒక్కరినీ మీ పేటలో కలుస్తాను .. అప్పటివరకూ 'హ్యాపీ న్యూ ఇయర్' అంటూ వదిలిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. రజనీకాంత్ ఈ సినిమాలో మరింత యంగ్ గా .. స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఆయన సరసన కథానాయికలుగా సిమ్రాన్ .. త్రిష నటించారు. ఇక ముఖ్యమైన పాత్రల్లో నవాజుద్దీన్ సిద్ధిఖీ .. విజయ్ సేతుపతి .. బాబీ సింహా కనిపించనున్నారు. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సంక్రాంతికి రజనీ చేసే సందడి ఒక రేంజ్ లో ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. 
rajani
simran
trish

More Telugu News