చంద్రబాబుకు నేనిచ్చే రిటర్న్ గిఫ్ట్ అద్భుతంగా ఉంటుంది: కేసీఆర్
- చంద్రబాబు మేనేజర్ మాత్రమే
- ఘోరాతి ఘోరంగా ఓడిపోవడం ఖాయం
- నేను చేసేది చిల్లరగాళ్లకు అర్థం కాదు
- అందరిపై రాజకీయంగా ఒత్తిడి పెంచుతున్నా
ఫెడరల్ ఫ్రంట్ విషయంలో తాను ఏం చేస్తున్నానో చిల్లర గాళ్లకు అర్థం కాదని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం రాజకీయంగా అందరిపై ఒత్తిడి పెంచుతున్నట్టు వెల్లడించారు. తమ అజెండా.. ఆర్థిక ప్రణాళిక ఇంకా బయటకు రాలేదన్నారు. తాను అనుకున్నది సాధించేందుకు కాస్త సమయం పడుతుందన్నారు.