కన్నడలోను 'పేట' విడుదల ఖరారు!
- కన్నడలోను అనువాద చిత్రాల జోరు
- '2.ఓ'కి విశేషంగా లభించిన ఆదరణ
- కన్నడలోను సందడి చేయనున్న 'పేట'
ఈ నేపథ్యంలో ఈ సినిమా కన్నడలోను విడుదల కానుండటం రజనీ అభిమానులకు మరింత ఆనందాన్ని కలిగించే విషయం. తమ చిత్ర పరిశ్రమను కాపాడుకోవడానికి అక్కడివారు ఇన్నాళ్లూ డబ్బింగ్ చిత్రాల విడుదలను నిరోధిస్తూ వచ్చారు. అయితే, ఇటీవలి కాలంలో ఆ పరిస్థితి మారుతూ వచ్చింది. డబ్బింగ్ చిత్రాలకు మెల్లిగా సడలింపు లభిస్తోంది. ఇటీవల కన్నడలో విడుదలైన '2.ఓ' 50 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు 'పేట' సినిమా కూడా కన్నడలో విడుదల కానుంది. రజనీకి కర్ణాటకలో వున్న ఫాలోయింగ్ కారణంగా అక్కడ కూడా ఈ సినిమా దుమ్మురేపేయడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది.