నవ్యాంధ్రకు మరో సంస్థ.. ఫైబర్ ఆధారిత పరిశ్రమ ఏర్పాటుకు ఆదిత్య బిర్లా గ్రూప్ రెడీ
- ఉండవల్లిలో చంద్రబాబును కలిసిన సంస్థ ప్రతినిధులు
- రూ. 4 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ వీఎస్ఎఫ్ కాంప్లెక్స్
- 3,500 మందికి ఉద్యోగావకాశాలు
పెల్యులోజ్ అనే పునరుత్పాదక ముడి పదార్థం నుంచి ప్రపంచశ్రేణి ప్రమాణాలతో పర్యావరణ హితమైన నారను ఈ కంపెనీలో తయారు చేయనున్నారు. టెక్స్‌టైల్ రంగంలో అతి పెద్ద సంస్థ అయిన ఆదిత్య బిర్లా గ్రూప్‌కు ప్రపంచవ్యాప్తంగా ఐదు వందలకు పైగా సంస్థల్లో చెయిన్ పార్ట్‌నర్లు ఉన్నట్టు ప్రతినిధులు తెలిపారు. అనుమతులు లభిస్తే మొదటి దశను రెండేళ్లలోనే పూర్తి చేస్తామని వివరించారు.