సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ముద్ర వేస్తానంటున్న రాశిఖన్నా!
  • నితిన్, రష్మికల 'భీష్మ'అప్ డేట్
  • గూఢచారి పాత్రలో యాక్షన్ హీరో 
  • ఆది సినిమా షూటింగ్ పూర్తి  
*  ఎలాంటి పాత్ర వచ్చినా దానిని బాగా చేసేందుకు కష్టపడతానని అంటోంది కథానాయిక రాశిఖన్నా. ''మనం చేసే పాత్రలే మనకు మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతుంటాయి. నాకూ అలాగే అవకాశాలు వస్తున్నాయి. 'ఫలానా సినిమాలో నీ నటన చూసే దీనికి తీసుకున్నాం' అని దర్శకులు చెబుతుంటారు. అందుకే, పాత్ర ఎలాంటిదైనా దానిపై నా ముద్ర వేయడానికి ప్రయత్నిస్తాను'' అని చెప్పింది రాశిఖన్నా.
*  వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా 'భీష్మ' పేరిట ఓ చిత్రం రూపొందనున్న సంగతి విదితమే. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పని ఆఖరి దశలో వుందని, నితిన్ భుజం గాయం నుంచి కోలుకుంటున్నాడని, త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని దర్శకుడు వెంకీ తెలిపారు. ఇందులో రష్మిక కథానాయికగా నటిస్తుంది.
*  యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడుగా తిరు సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో గోపీచంద్ గూఢచారి పాత్రలో కనిపిస్తాడట.  
*  గత కొన్నాళ్లుగా విజయాలకు దూరంగా వున్న ఆది సాయికుమార్ తాజాగా 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' చిత్రంలో నటిస్తున్నాడు. సాయికిరణ్ అడవి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
Go Back to Shorts
Rashikhanna
Nithin
Gopichand
Aadi
Rashmika

More Telugu News