నాకు కూడా యాక్షన్ సినిమాలు చేయాలనే వుంటుంది: వరుణ్ తేజ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాకు కూడా యాక్షన్ సినిమాలు చేయాలనే వుంటుంది: వరుణ్ తేజ్

  • కాదనలేని కథ చెప్పాడు 
  • కథను చాలా పట్టుగా నడిపించాడు 
  • నా కెరియర్లో ఈ సినిమా ప్రత్యేకం      
యువ కథానాయకులు ఎక్కువగా లవ్ అండ్ యాక్షన్ సినిమాలకి ప్రాధాన్యతనిస్తుంటారు. కానీ వరుణ్ తేజ్ మాత్రం అందుకు పూర్తి భిన్నమైన కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు. 'కంచె'.. 'ఫిదా' .. ఇలా విభిన్నమైన కథా చిత్రాలను ఆయన ఎంచుకుంటూ వస్తున్నాడు. 'అంతరిక్షం' సినిమాలో ఆయన వ్యోమగామిగా కనిపించనున్నాడు. ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ .. "మిగతా యంగ్ హీరోల మాదిరిగానే నాకు కూడా యాక్షన్ సినిమాలు చేయాలని ఉంటుంది. గాల్లోకి ఎగిరిపడుతూ రౌడీలతో ఫైట్ చేయాలని ఉంటుంది. సంకల్ప్ రెడ్డి నుంచి అలాంటి కథనే ఆశించాను. కానీ ఆయన ఈ కథ చెప్పి .. కాదనకుండా చేశాడు. ఈ సినిమాలో పాటలు .. కామెడీ సీన్స్ పెట్టొచ్చు. కానీ సంకల్ప్ రెడ్డి కథను పట్టుగా నడిపించడంపైనే దృష్టి పెట్టాడు. కచ్చితంగా ఈ సినిమా నా కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చాడు. 
varun tej
lavnya
adithi

More Telugu News