నిర్మాతగా అల్లు అరవింద్ పెద్దబ్బాయి బాబీ .. హీరోగా వరుణ్ తేజ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిర్మాతగా అల్లు అరవింద్ పెద్దబ్బాయి బాబీ .. హీరోగా వరుణ్ తేజ్

  •  నిర్మాణ రంగంలోకి బాబీ
  • తొలి సినిమా వరుణ్ తేజ్ తో 
  • క్రీడల నేపథ్యంలో సాగే ప్రేమకథ    
నిర్మాతగా అల్లు అరవింద్ అందుకున్న విజయాలు అన్నీ ఇన్నీ కావు. అపారమైన అనుభవం ఆయన సొంతం. అలాంటి అల్లు అరవింద్ ముగ్గురు తనయుల్లో అల్లు అర్జున్ .. అల్లు శిరీశ్ నటన వైపుకి మొగ్గుచూపారు. ఈ ఇద్దరిలో అల్లు అర్జున్ స్టార్ హీరోల జాబితాలోకి చేరిపోయాడు. అల్లు శిరీశ్ సరైన హిట్ కోసం వెయిట్ చేస్తూ ముందుకు వెళుతున్నాడు.

ఇక పెద్ద కొడుకైన బాబీ మాత్రం తండ్రి మాదిరిగానే సినిమా నిర్మాణం పట్ల ఆసక్తిని చూపుతున్నాడు. తమకి దగ్గరి బంధువైన సిద్ధూతో కలిసి ఒక సినిమాను నిర్మించడానికి రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. తొలి సినిమాను వరుణ్ తేజ్ తో చేయనున్నట్టు తెలుస్తోంది. క్రీడల నేపథ్యంలో సాగే ప్రేమ కథాంశంతో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. కిరణ్ అనే కొత్త కుర్రాడు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతాడని చెబుతున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి. 
varun tej

More Telugu News