rajasekhar: రాజశేఖర్ గారు నన్ను ఇబ్బంది పెట్టడం లేదు: దర్శకుడు ప్రశాంత్ వర్మ

షార్ట్స్‌లో చూడండి
 రాజశేఖర్ కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'కల్కి'అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమా కొంతవరకూ షూటింగ్ జరుపుకుంది. ఇంకా కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించవలసి వుంది. సి.కల్యాణ్ తో కలిసి రాజశేఖర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ వర్మకి .. రాజశేఖర్ కి మధ్య విభేదాలు తలెత్తాయనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

డైరెక్షన్ విషయంలో రాజశేఖర్ కలగజేసుకుని ప్రశాంత్ వర్మని విసిగిస్తున్నారనీ, ఆయన ఇగో కారణంగా ప్రశాంత్ వర్మ ఇబ్బంది పడుతున్నాడని చెప్పుకుంటున్నారు. రాజశేఖర్ అసహనం కారణంగా ఇటీవల రెండుసార్లు షూటింగును క్యాన్సిల్ చేశారనే వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై ప్రశాంత్ వర్మ స్పందిస్తూ .. జరుగుతోన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని చెప్పాడు. రాజశేఖర్ గారు ఏ విషయంలోను జోక్యం చేసుకోవడం లేదనీ, తనకి కావలసినవి ఒక నిర్మాతగా వెంటనే ఏర్పాటు చేస్తున్నారని అన్నాడు. రాజశేఖర్ గారు చాలా మంచి మనిషనీ, ఆయనలాంటి స్వీటెస్ట్ పర్సన్ తో ఇంతవరకూ తాను పనిచేయలేదంటూ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. 
Go Back to Shorts
rajasekhar
prashanth

More Telugu News