రక్తంతో లవ్ లెటర్స్ రాసేవాడు .. ఏకంగా ఇంటికి కూడా వచ్చేశాడు: సీనియర్ హీరోయిన్ లత
- ప్రతినెలా నాకు మనియార్డర్ పంపేవాడు
- భార్యకి రాసినట్టుగా ఉత్తరాలు రాసేవాడు
- ఇంటికి వస్తే మా వాళ్లు బయటికి పంపించేశారు
"ఒక రోజున నాకు ఒక లెటర్ వచ్చింది .. 'ప్రియమైన భార్యకి .. ఎలా వున్నావు .. బాగున్నావా .. నీకు డబ్బు పంపిస్తున్నాను .. త్వరలోనే వచ్చి నిన్ను తీసుకెళతాను' అంటూ ఒక మనియార్డర్ కూడా పంపించాడు. ఎవరో పిచ్చాడనుకుని పెద్దగా పట్టించుకోకుండా పక్కన పడేశాను. కానీ ప్రతి నెలా లవ్ లెటర్ తో పాటు మనియార్డర్ వస్తుండేది .. 200 రూపాయలు పంపించేవాడు. మనియార్డర్ మాత్రం నేను తిప్పిపంపించేసే దానిని. ఒక రోజున నేరుగా ఇంటికే వచ్చేశాడు .. మా వాళ్లు ఆయనను బయటికి పంపించేశారు. ఆ తరువాత తాను చాలా హర్ట్ అయ్యానంటూ రక్తంతో లెటర్ రాశాడు"అంటూ నవ్వేశారు.