Narendra Modi: మోదీ దుర్మార్గుడని తేలిపోయింది: సినీ హీరోయిన్ మాధవి సంచలన వ్యాఖ్యలు

  • మోదీ గురించి తెలుసుకోవడం కోసమే బీజేపీలో చేరిక
  • ఇలా జాతీయగీతాన్ని రుద్దడమేంటి?
  • ఫేస్ బుక్ లో మాధవి
తాను బీజేపీలో చేరిందే నరేంద్ర మోదీ నిజస్వరూపం గురించి తెలుసుకుందామని, ఆయన దుర్మార్గుడని తేలిపోయిందని హీరోయిన్ మాధవి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ఉదయం ఫేస్ బుక్ లో పోస్టు పెట్టిన ఆమె పలు ఆరోపణలు చేసింది.

 "నేను బీజేపీ లో జాయిన్ అయ్యిందే అసలు దేశానికి బీజేపీ నిజంగా సహాయం చేస్తుందా? నాశనం చేస్తుందా? అని తెలుసు కోవడానికే.. ట్రూగా మోదీ దుర్మార్గుడు. ఈ రోజు అయన ఏమి చేసాడో చెప్తా వినండి. ఎపుడో చిన్నపుడు స్కూల్ లో జాతీయగీతం పాడాను. మర్చిపోయి చాల ఇయర్స్ అయింది. ఎవడికి కావాలి తొక్కలో గీతం. మీటింగ్స్ పెట్టిన అదే... ఏం జరిగినా అదే... ఆఖరికి ఎంజాయ్ చేద్దామని మూవీకి పోతే జాతీయగీతమా. ఏమయ్యా మోదీ... మాకు అవసరమా? మజా చేసద్దామని సినిమాకి పోతే దేశభక్తి ఏంటి? మాకు ఛీ... పని పాట లేని పనులు మీరు. మాకొద్దు ఇలాంటివి. మెం పక్కా లోకల్. పక్కా లోకల్... అలంటి పాట పాడుకుంటాం. కిక్ వస్తది. అయ్యా మోడీ నీకు దేశభక్తి ఉంటె నువ్ పాడుకో. మాకెందుకు రుద్దడం నీవల్ల దేశానికి ఎం ఉపయోగం?" అని వ్యాఖ్యానించింది.
Narendra Modi
Madhavi
Facebook
National Anthem

More Telugu News