సస్పెన్స్ తో కొనసాగిన '118' టీజర్
- కల్యాణ్ రామ్ నుంచి '118'
- సస్పెన్స్ ప్రధానంగా సాగే కథ
- జనవరిలో భారీ విడుదల
కల్యాణ్ రామ్ .. షాలినీ పాండేకి సంబంధించిన విజువల్స్ పైనే ఈ టీజర్ ను కట్ చేశారు. ముందు వాళ్లు సంతోషకరమైన జీవితాన్ని అనుభవించడం .. ఆ తరువాత అనూహ్యమైన సంఘటనలను ఫేస్ చేయడం ఈ టీజర్ లో కనిపిస్తోంది. మరో కథానాయిక అయిన నివేదా థామస్ రోల్ ను ఎక్కడా రివిల్ చేయకపోవడం విశేషం. టీజర్ అంతా కూడా సస్పెన్స్ ను మెయింటేన్ చేస్తూ కొనసాగింది. టైటిల్ కి తగినట్టుగానే విజువల్స్ కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమా కల్యాణ్ రామ్ ను కొత్తగా చూపించనుందనే విషయం మాత్రం అర్థమవుతోంది.