సాయిపల్లవిని తిట్టుకుంటారు .. నన్ను చూసి అయ్యోపాపం అంటారు!: శర్వానంద్
- ప్రతి రోజు కొత్తగా ప్రేమించాలనే కాన్సెప్ట్
- పదే పదే ప్రేమలో పడేయడం చాలా కష్టం
- క్రెడిట్ హను రాఘవపూడికే దక్కుతుంది
"ప్రతి రోజు కొత్తగా ప్రేమించాలి అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందింది. అందుకే ఈ సినిమాకి హను రాఘవపూడి ఈ టైటిల్ పెట్టాడు. లవ్ లో ఒకసారి పడేయడమే కష్టం ..అలాంటిది ఇందులో హీరోయిన్ ను పదే పదే లవ్ లో పడేయడానికి ఎన్ని కష్టాలు పడ్డానో తెరపై చూస్తే తెలుస్తుంది.
ఈ సినిమా చూసేవాళ్లు సాయిపల్లవిని తిట్టుకుంటారు .. నన్ను అయ్యో పాపం అంటారు. సూర్యలాంటి బాయ్ ఫ్రెండ్ వుంటే బాగుండునని అనుకుంటారు .. సాయిపల్లవికి ఇంత తిక్కా అనుకుంటారు. ఈ సినిమాకి సంబంధించి నటన పరంగా నాకు .. సాయిపల్లవికి మంచి మార్కులు పడితే కనుక అందుకు హను రాఘవపూడినే కారణమనడంలో ఎలాంటి సందేహం లేదు" అని చెప్పుకొచ్చాడు.