KCR: కేసీఆర్, ఆంధ్రా వస్తావా? రా చూద్దాం.. నీది లాటరీ.. చంద్రబాబుది హిస్టరీ!: బాలకృష్ణ

షార్ట్స్‌లో చూడండి
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గడ్డి అన్నారంలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ.. ‘కేసీఆర్.. ఆంధ్రా వస్తావా? రా చూద్దాం’ అని సవాల్ విసిరారు. హైదరాబాద్‌లో చంద్రబాబు పేరు లేకుండా చేయాలంటే హైటెక్ సిటీ, ఫ్లైఓవర్లు తీసేయాలని.. అవి తీసే దమ్ముందా? అని ప్రశ్నించారు.

చంద్రబాబు చరిత్ర చెరిపితే చెరిగేది కాదన్నారు. కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు తరిమితే ఎక్కడికో ఓ చోటకి పోవాల్సిందేనన్నారు. గత ఎన్నికల్లో తెలంగాణలో రైతుల ప్రభుత్వం వస్తుందనుకుంటే.. రాబందుల ప్రభుత్వం వచ్చిందని ఆరోపించారు. కేసీఆర్‌ది లాటరీ అని.. చంద్రబాబుది హిస్టరీ అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.   
Go Back to Shorts
KCR
Balakrishna
Chandrababu
Andhra Pradesh
Telangana

More Telugu News