తల్లి లాంటి పార్టీని మోసం చేసిన వారికి తగిన బుద్ధి చెప్పండి: నందమూరి బాలకృష్ణ
- ప్రజాకూటమి అభ్యర్థులను గెలిపించాలి
- హైదరాబాద్ ని తీర్చిదిద్దిన ఘనత ఎన్టీఆర్, చంద్రబాబులదే
- ఎన్ని అవాంతరాలొచ్చినా విజయం ఖాయం
హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దిన ఘనత ఎన్టీఆర్, చంద్రబాబులదేనని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు.. కేసీఆర్ లా కాదని, నిరంతరం అభివృద్ధికి పాటుపడే వ్యక్తి అని ప్రశంసించారు. చంద్రబాబు కట్టించిన భవనాల్లో మీటింగ్స్ పెట్టుకుంటున్న కేసీఆర్, ఆయన్నే విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా టీడీపీ జెండా ఎగరడం ఖాయమని, ప్రజాకూటమి అభ్యర్థులకు విజయం తథ్యమని బాలకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ పైనా ఆయన విమర్శలు చేశారు.