మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గోపీచంద్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గోపీచంద్

  • గోపీచంద్ హీరోగా కొత్త చిత్రం 
  • కొత్త దర్శకుడి పరిచయం 
  • వచ్చేనెలలో సెట్స్ పైకి    
కొంతకాలంగా గోపీచంద్ ను వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. 'పంతం' సినిమా కూడా ప్రేక్షకుల ఆదరణ పొందకపోవడంతో, ఆయనతో పాటు అభిమానులు కూడా నిరాశకి లోనయ్యారు. ఈ నేపథ్యంలో మంచి కథ కోసం వెయిట్ చేస్తూ ఆయన కొంత గ్యాప్ తీసుకున్నాడు. రీసెంట్ గా కొత్త దర్శకుడు 'తిరు సుబ్రహ్మణ్యం' ఒక కథను వినిపించగా, బాగా నచ్చేసిందట.

ఇంతవరకూ తాను చేయని జోనర్ కావడం .. పాత్ర చాలా కొత్తగా అనిపించడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. యాక్షన్ ఎంటర్టైనర్ గా అనిపించినప్పటికీ కొత్త కోణంలో కథ ముందుకు వెళుతుందని అంటున్నారు. ప్రస్తుతం కథానాయికల అన్వేషణ కొనసాగుతోందట. అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమాను వచ్చేనెలలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. టైటిల్ తో పాటు పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారని సమాచారం.        
gopichand

More Telugu News