trisha: తన పెళ్లి వార్తల గురించి స్పందించిన త్రిష

షార్ట్స్‌లో చూడండి
తమిళంలో నటనకి ప్రాధాన్యత కలిగిన పాత్రలను .. నాయిక ప్రాధాన్యత కలిగిన పాత్రలను చేస్తూ, నయనతార తరువాత స్థానంలో త్రిష దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఒక వ్యాపార వేత్తతో త్రిష ప్రేమలో పడిందనీ, త్వరలోనే ఆయనతో ఆమె వివాహం జరగనుందనే టాక్ కోలీవుడ్ లో బలంగా వినిపిస్తోంది. పెళ్లి తరువాత సినిమాలు మానేస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది.

ఈ విషయాలను గురించి తాజాగా త్రిష స్పందించింది. "ప్రస్తుతం నా పెళ్లి గురించి జరుగుతోన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజంలేదు. ఈ మధ్య కాలంలో నా గురించి అసత్య ప్రచారాలు ఎక్కువైపోయాయి .. అందులో ఇదొకటి. నాకు నచ్చిన వ్యక్తి తారసపడితే .. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ విషయాన్ని నేనే చెబుతాను. ఈ విషయాన్ని దాచాలని కూడా నేను అనుకోవడంలేదు. ఇక పెళ్లి తరువాత నేను సినిమాలు చేస్తానా .. మానేస్తానా అనేది అప్పుడు తీసుకోవలసిన నిర్ణయం. అందువలన అనవసరమైన ప్రచారాలకు దయచేసి ఫుల్ స్టాప్ పెట్టేయండి" అని చెప్పుకొచ్చింది.    
Go Back to Shorts
trisha

More Telugu News