varun tej: 'అంతరిక్షం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా మెగా బ్రదర్స్

షార్ట్స్‌లో చూడండి
సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా 'అంతరిక్షం' నిర్మితమైంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ వ్యోమగామిగా కనిపించనున్నాడు. తన కెరియర్లోనే ఈ సినిమా ప్రత్యేకమైన స్థానంలో నిలుస్తుందని వరుణ్ తేజ్ భావిస్తున్నాడు. అంతరిక్షం నేపథ్యంలో సాగే కథతో రూపొందిన తొలి తెలుగు సినిమా కావడంతో, అందరూ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేనెల 9వ తేదీన నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ వేడుకకి చిరంజీవి .. పవన్ కల్యాణ్ లను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారట. మెగా బ్రదర్స్ తప్పకుండా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఫంక్షన్ కి రావడానికి ఇద్దరికీ ఎప్పుడు కుదురుతుందో ముందుగా తెలుసుకునే డిసెంబర్ 9వ తేదీని ఖరారు చేశారని చెబుతున్నారు. లావణ్య త్రిపాఠి .. అదితీరావు కథానాయికలుగా నటించిన ఈ సినిమాను, డిసెంబర్ 21వ తేదీన విడుదల చేయనున్నారు.    
Go Back to Shorts
varun tej
lavanya
adithi

More Telugu News