భూమిక విడాకుల ప్రచారం గురించి నిర్మాత బెక్కెం వేణుగోపాల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భూమిక విడాకుల ప్రచారం గురించి నిర్మాత బెక్కెం వేణుగోపాల్

  • భూమిక దంపతులు అన్యోన్యంగా వుంటారు 
  • ఇద్దరి మధ్యా ఎలాంటి మనస్పర్థలు లేవు 
  • ఇది కేవలం పుకారు మాత్రమే   
నిర్మాతగా బెక్కెం వేణుగోపాల్ కి మంచి పేరు వుంది. భూమికతో సినిమాలు నిర్మించిన కారణంగా ఆమె ఫ్యామిలీతో ఆయనకి మంచి సాన్నిహిత్యం వుంది. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. "భూమిక - భరత్ ఠాకూర్ విడిపోయారని ఒక రూమర్ హల్ చల్ చేస్తోంది. ఇందులో వాస్తవమెంత?" అనే ప్రశ్న ఆయనకి టీఎన్నార్ నుంచి ఎదురైంది.

అప్పుడు వేణుగోపాల్ స్పందిస్తూ .. "భూమిక - భరత్ ఠాకూర్ ఎంతో అన్యోన్యంగా వుంటారు. ఇంతవరకూ వాళ్ల మధ్య ఎలాంటి మనస్పర్థలు రాలేదు .. ఇకముందు రావు కూడా. ఎందుకంటే వాళ్ల గురించి నాకు బాగా తెలుసు. ఎవరో పనిలేని వాళ్లు ఈ పుకారును పుట్టించి వుంటారు. ఈ విషయం గురించి ఒకసారి మీడియా ముఖంగా క్లారిటీ ఇస్తారా? అని నేను భూమికను అడిగాను కూడా. పనిలేని వాళ్లు చేసే ప్రచారాలకు ఎందుకు స్పందించాలని ఆమె అన్నారు. వాళ్లిద్దరూ చాలా సంతోషంగా వున్నారనడంలో ఎవరికి ఎలాంటి సందేహం అవసరం లేదు" అని ఆయన అన్నారు.   
bhumika

More Telugu News