శృంగార తార సన్నీలియోన్ కు విశాల్ మద్దతు!
- వీరమహాదేవి సినిమాలో సన్నీ
- వ్యతిరేకిస్తున్న కన్నడ, తమిళ సంఘాలు
- అండగా నిలిచిన పందెంకోడి హీరో
ఇలాంటి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న చిత్రంలో సన్ని లియోన్ వంటి శృంగార తార నటించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదం ఇక్కడితో ఆగిపోలేదు. వీరమహాదేవి చిత్రానికి వ్యతిరేకంగా కొందరు తమిళనాడులో న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సన్నీలియోన్ కు కోలీవుడ్ హీరో విశాల్ మద్దతుగా నిలిచారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమా రీమేక్ ‘అయోగ్య’లో విశాల్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం చిత్రీకరిస్తున్న ప్రత్యేక గీతంలో సన్నీ లియోన్ కు విశాల్ ఛాన్సిచ్చారు. తమిళ టెంపర్ లో విశాల్ కు జోడీగా రాశిఖన్నా నటిస్తోంది.