Telangana: కేసీఆర్ తల నరుక్కుంటాడో, కేటీఆర్ సన్యాసం తీసుకుంటాడో అప్పుడు చూద్దాం!: కాంగ్రెస్ నేత వీహెచ్

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని ఆ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం రాకముందు ఒకలా మాట్లాడిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నారని విమర్శించారు. మంత్రి కేటీఆర్ రాజకీయ సన్యాసం తీసుకుంటే ఎవ్వరికీ నష్టం లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో వీహెచ్ మాట్లాడారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ తల నరుక్కుంటాడో, కేటీఆర్ సన్యాసం తీసుకుంటాడో డిసెంబర్ 11 తర్వాత చూద్దామని వీహెచ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇచ్చిన సోనియాను చులకనగా మాట్లాడితే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రజా కూటమి(మహాకూటమి) ఘనవిజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు.
Go Back to Shorts
Telangana
Hyderabad
VH
Congress
KTR
KCR

More Telugu News