కాంతారావు జీవితంలో ఎవరికీ తెలియని ఘట్టాలు వున్నాయి: దర్శకుడు పీసీ ఆదిత్య
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాంతారావు జీవితంలో ఎవరికీ తెలియని ఘట్టాలు వున్నాయి: దర్శకుడు పీసీ ఆదిత్య

  • కాంతారావు జయంతి నేడు 
  • ఆయన బయోపిక్ లో ఎవరికీ తెలియని నిజాలు
  • డిసెంబర్ 10 నుంచి రెగ్యులర్ షూటింగ్  
తెలుగు తెరవేల్పులలో ఎన్టీఆర్ .. ఏఎన్నార్ తరువాత వినిపించే పేరు కాంతారావు. ఎన్టీఆర్ తో పాటు జానపదాలు .. ఏఎన్నార్ తో పాటు సాంఘికాలు చేసి మెప్పించిన ఘనత కాంతారావు సొంతం. అలాంటి కాంతారావు జయంతి ఈ రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, కాంతారావు బయోపిక్ ను ఈ రోజున ఆరంభిస్తున్నట్టుగా దర్శకుడు పీసీ ఆదిత్య చెప్పారు.

కాంతారావు సొంత ఊరైన కోదాడ సమీపంలోని 'గుడిబండ' కి వెళ్లి మరీ పీసీ ఆదిత్య కొన్ని వివరాలను సేకరించారు. కాంతారావు భార్యను.. వారి అబ్బాయిలను అడిగి మరికొన్ని వివరాలను సేకరించారు. కాంతారావు జీవితంలో ఎవరికీ తెలియని కొన్ని ఘట్టాలు ఉన్నాయనీ, వాటిని ఈ సినిమాలో ఆవిష్కరించడం జరుగుతుందని ఆదిత్య అన్నారు. డిసెంబర్ 10 తరువాత రెగ్యులర్ షూటింగును జరపనున్నామని చెప్పారు.  
kantharao
adithya

More Telugu News