కేసీఆర్ ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్ రాజీనామా
- కేసీఆర్‌తోపాటే ఎన్నికల సభల్లోకి
- ఎన్నికల నిబంధనల ప్రకారం నేరం
- అందుకే రాజీనామా
ఎన్నికల నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ పదవిలో ఉండే వ్యక్తులు ఎన్నికల సభల్లో, ప్రచారంలో పాల్గొనడానికి వీలుకాదు. ఈ కారణంగానే తాను రాజీనామా చేసినట్టు దేశపతి తెలిపారు. రాజీనామా పత్రాన్ని ప్రభుత్వానికి పంపానని పేర్కొన్నారు. కాగా, దేశపతి శ్రీనివాస్ రాజీనామాను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.