జగన్ ఇక మీ బిడ్డ... జాగ్రత్తగా చూసుకోండి!: పెల్లుబుకుతున్న కన్నీటితో ప్రజలకు విజయమ్మ వినతి
- రెండు వారాల విశ్రాంతి తరువాత జగన్ పాదయాత్ర
- హత్యాయత్నాన్ని గుర్తు చేసుకుని విజయమ్మ భావోద్వేగం
- తన కొడుకును ఆశీర్వదించాలని విజ్ఞప్తి
నేడు జగన్ తిరిగి విజయనగరానికి బయలుదేరుతున్నాడని గుర్తు చేసిన ఆమె, "జగన్ జనం కోసం వెళుతున్నాడు. రాజశేఖరరెడ్డి గారు ఎప్పుడూ చెప్పేవారు. కొనసాగించడం... స్టార్ట్ చేసిన పనిని మధ్యలో ఆపకూడదు. నాయకుడి లక్షణమే అదని. జగన్ కూడా అదే లక్షణాన్ని కలిగున్నాడు. తను పాదయాత్రకు వెళుతున్నాడు. నాడు ఎలాగైతే మీ చేతికి అప్పగించానో, నేడు మరలా అదే పని చేస్తున్నాను.
ఒకటి మాత్రమే నేను చేయగలను. జగన్ క్షేమం కోసం ప్రార్థన చేయగలను. భరోసా ఇవ్వాల్సింది, మాట ఇవ్వాల్సింది మీరే. నేను రెండు చేతులూ ఎత్తి విజ్ఞప్తి చేస్తున్నా. నా కొడుకును కాపాడండి. ఆశీర్వదించండి" అని ఆమె కోరారు.