Chandrababu: చంద్రబాబును కలిసేందుకు రేపు అమరావతికి వస్తున్న రాహుల్ దూత అశోక్ గెహ్లాట్

షార్ట్స్‌లో చూడండి
జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలను ఏకం చేస్తూ, మహాకూటమిని ఏర్పాటు చేసే క్రమంలో పలువురు నేతలతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అవుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ అధినేత రాహుల్ తో కూడా చంద్రబాబు చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం కాంగ్రెస్ శిబిరంలో కూడా ఉత్సాహం పెరిగింది. ఈ నేపథ్యంలో, చంద్రబాబును కలిసేందుకు రాహుల్ గాంధీ దూత, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ రేపు అమరావతికి వస్తున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మధ్యాహ్నం 3 గంటలకు వీరు భేటీ కానున్నారు. మహాకూటమి సహా పలు అంశాలపై వీరు చర్చించే అవకాశం ఉంది. 
Go Back to Shorts
Chandrababu
ashok gehlat
congress
Telugudesam
mahakutami

More Telugu News