నా మీద కాంగ్రెస్ పార్టీలో ఐదు ఫీట్లున్నోడు కూడా ఆరారు ఫీట్లు ఎగిరాడు: మంత్రి కేటీఆర్ ఎద్దేవా
Add ap7am to your home Screen

నా మీద కాంగ్రెస్ పార్టీలో ఐదు ఫీట్లున్నోడు కూడా ఆరారు ఫీట్లు ఎగిరాడు: మంత్రి కేటీఆర్ ఎద్దేవా

  • ఏ అమ్మా బొమ్మా తెలంగాణ ఇవ్వలేదంటే విమర్శలా?
  • నాడు సోనియాని బాబు ఏమన్నాడో గుర్తుచేసుకోండి!
  • ‘అవినీతి అనకొండ సోనియాగాంధీ’ అని బాబు అనలే?
తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి గెలుచుకున్నాం తప్ప, ‘మాకు ఏ అమ్మా బొమ్మా తెలంగాణ ఇవ్వలేదని’ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీపై మంత్రి కేటీఆర్ తరచుగా వ్యాఖ్యలు చేస్తుండటం తెలిసిందే. తాను ఈ వ్యాఖ్యలు చేసినందుకు తనపై కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.

రాజన్న సిరిసిల్లలో ఆర్ఎంపీ, పీఎంపీలతో నిర్వహించిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ, "నా మీద కాంగ్రెస్ పార్టీలో ఐదు ఫీట్లున్నోడు కూడా ఆరారు ఫీట్లు ఎగిరాడు. మరి, నా మీద అంత ఎగబడ్డారు..’ నాడు సోనియాగాంధీని చంద్రబాబు ఏమన్నాడో ఒకసారి గుర్తుచేసుకోండి" అన్నారు.

‘‘అవినీతి అనకొండ సోనియాగాంధీ’, ‘సోనియాగాంధీ కాదు సోనియా గాడ్సే’,‘సోనియా ఈ దేశానికి పట్టిన శని’ అన్న మాటలు తాను అంటున్నవి కాదని, మీ దోస్త్ చంద్రబాబు అన్నాడు’ అని, అటువంటి వ్యక్తితో కలిశారంటూ కాంగ్రెస్ నాయకులపై నిప్పులు చెరిగారు. 
KTR
t-congress
TRS
rajanna siricilla

More Telugu News