మా పార్టీ గుర్తు ‘అగ్గిపెట్టె’: కోదండరామ్
Add ap7am to your home Screen

మా పార్టీ గుర్తు ‘అగ్గిపెట్టె’: కోదండరామ్

  • టీజేఎస్ ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేశాం
  • ఇప్పటివరకైతే 10 సీట్లలో పోటీ చేస్తాం
  • మరో మూడు నాలుగు నియోజకవర్గాల్లో మా అభ్యర్థులు బలంగా ఉన్నారు
టీజేఎస్ ఎన్నికల గుర్తు ‘అగ్గిపెట్టె’ను ఆ పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ విడుదల చేశారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీజేఎస్ ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేశామని, ఎన్నికల కమిషన్ అనుమతి కోసం పంపుతున్నట్టు చెప్పారు.

ఇప్పటివరకైతే పది సీట్లలో పోటీ చేయాలని ఆలోచిస్తున్నామని, మరో మూడు నాలుగు నియోజకవర్గాల్లో తమకు బలమైన అభ్యర్థులు ఉన్నారని, ఆ విషయమై పరిశీలించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరనున్నట్టు చెప్పారు. ఇప్పటికే నెలరోజులు ఆలస్యం కావడం అన్నది కొంత నష్టం చేసిందని, దీంతో కొంత నిరుత్సాహం కలిగిందని, ప్రచారం దెబ్బతిందని అన్నారు.

ఇప్పటికైనా మించిపోయింది లేదని, దీపావళి నాటికైనా పొత్తులు ఖరారు చేస్తే బాగుంటుందన్నది తన అభిప్రాయమని అన్నారు. రాజకీయాల్లో పెనుమార్పుల కోసం తమ పార్టీ కృషి చేస్తుందని, మహాకూటమిని విచ్ఛిన్నం చేయాలని టీఆర్ఎస్ యత్నిస్తోందని విమర్శించారు. ప్రజల ఆకాంక్ష మేరకు మహాకూటమిని నిలబెట్టే బాధ్యత తమపై ఉందని అన్నారు.
tjs
professor kodandaram
congress

More Telugu News