ప్రభాస్ కళ్లలో దుమ్ముపడినప్పుడు వర్షం పడుతుందని ఆడియన్స్ అనుకున్నారు: పరుచూరి గోపాలకృష్ణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్ కళ్లలో దుమ్ముపడినప్పుడు వర్షం పడుతుందని ఆడియన్స్ అనుకున్నారు: పరుచూరి గోపాలకృష్ణ

  • హీరో కళ్లలో విలన్ దుమ్ముకొడతాడు 
  • డప్పుల చప్పుడికి హీరో స్పృహలోకి వస్తాడు 
  • విలన్ చావుకి హీరో కారకుడు కాకుండా చూపించాము
'వర్షం' సినిమాలో క్లైమాక్స్ సీన్ గురించి 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు. 'ఈ సినిమాలో హీరో .. విలన్ కొట్టుకుంటూ వుంటారు. ఓడిపోయే పరిస్థితుల్లో హీరో కళ్లలో విలన్ దుమ్ముకొట్టేస్తాడు. ఆ తరువాత హీరోను విలన్ విపరీతంగా కొట్టడం మొదలుపెడతాడు. ఆ సమయంలో వర్షం పడుతుందని ఆడియన్స్ ఆశిస్తారని అనుకున్నాము.

నిజంగానే ప్రభాస్ కళ్లలో దుమ్ము పడగానే  థియేటర్లోని జనం 'వర్షం .. వర్షం' అని అరిచారు. స్పృహ తప్పిపోయిన హీరో .. డప్పుల సౌండ్ తో లేచి విలన్ పై విరుచుకు పడతాడు. విలన్ ను హీరో చంపితే ఆయన ఒక హంతకుడు అని జనాలు అనుకుంటారు. అందువలన విలన్ ను హీరో త్రిశూలంతో చంపబోతుంటే త్రిష వారిస్తుంది. ఆ త్రిశూలంతో హీరోని విలన్ చంపబోగా, వెనకే వున్న రావణ విగ్రహం కూలి మీద పడటంతో విలన్ చనిపోయినట్టు చూపించాము. అంతా అయ్యాక అప్పుడు 'వర్షం' మొదలవుతుంది" అని చెప్పుకొచ్చారు.  
prabhas
trisha

More Telugu News