రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోన్న 'లైలా'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోన్న 'లైలా'

  • 'ఎగిరే పావురమా'తో ఆకట్టుకున్న లైలా
  • ఆమె చిరునవ్వుకు యువత ఫిదా 
  • వివాహం తరువాత నటనకు దూరం
తెలుగు తెరకి తమ నాజూకైన సౌందర్యాన్ని పరిచయం చేసిన కథానాయికలలో 'లైలా' పేరు కూడా కనిపిస్తుంది. 'ఎగిరే పావురమా' సినిమాతో చిత్రపరిశ్రమ దృష్టిని తనవైపుకు తిప్పుకున్న లైలా, తన చిరునవ్వుతో యూత్ హృదయాలను దోచేసింది. 'ఉగాది' .. 'పెళ్లి చేసుకుందాం' వంటి సినిమాలతో మరింత గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఆ తరువాత ఓ బిజినెస్ మేన్ ను పెళ్లి చేసుకుని నటనకు దూరమైంది.

అలాంటి లైలా మళ్లీ ఇప్పుడు సౌత్ సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపుతున్నట్టుగా తెలుస్తోంది. తనకి నచ్చిన పాత్రలు వస్తే చేయడానికి తాను సిద్ధంగా వున్నానని తన సంసిద్ధతను వ్యక్తం చేస్తోంది. రీ ఎంట్రీలో ఫస్టు ఛాన్స్ ఏ ప్రాజెక్టులో దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. గతంలో హీరోయిన్స్ గా మెప్పించిన చాలామంది .. ఇప్పుడు కేరక్టర్ ఆర్టిస్టులుగా తమ జోరును కొనసాగిస్తున్నారు. త్వరలో లైలా కూడా అదే బాట పట్టనుందన్న మాట.   
laila

More Telugu News