మన్మోహన్‌ సింగ్.. మిమ్మల్ని అపార్థం చేసుకున్నా!: అనుపమ్ ఖేర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మన్మోహన్‌ సింగ్.. మిమ్మల్ని అపార్థం చేసుకున్నా!: అనుపమ్ ఖేర్

  • మన్మోహన్ జీవిత ప్రయాణం నాకెన్నో నేర్పింది
  • మిమ్మల్ని అపార్థం చేసుకున్నా
  • చరిత్ర మిమ్మల్ని ఎప్పటికీ అపార్థం చేసుకోదు
బయోపిక్‌లకు సంబంధించి అన్ని ఇండస్ట్రీల్లోనూ మంచి ఆదరణ ఉంది. అయితే బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న బయోపిక్ మాత్రం చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అది మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ పేరుతో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మన్మోహన్‌గా ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్, సోనియా గాంధీ పాత్రలో సజ్జన్ బెర్నర్ట్ నటిస్తున్నారు. విజయ్ రత్నాకర్ గట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన విషయాన్ని అనుపమ్ సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. సెట్‌లో తీసిన వీడియోతో పాటు మన్మోహన్ పాత్రకు సంబంధించిన వీడియోను కూడా ఆయన పంచుకున్నారు.

ఈ వీడియో నిజంగా షాకింగ్‌గా అనిపిస్తోంది. అచ్చం మన్మోహన్, సోనియాలను చూస్తున్నట్టే అనిపిస్తోంది. ‘అద్భుతమైన సినిమా ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ షూటింగ్‌ పూర్తయింది. మొత్తం చిత్ర బృందానికి ధన్యవాదాలు. మన్మోహన్‌ సింగ్‌ జీవిత ప్రయాణం నాకు ఎన్నో నేర్పింది. ఈ సినిమా చేయడానికి ముందు నాలో కొన్ని ఆలోచనలు ఉండేవి, మిమ్మల్ని అపార్థం చేసుకున్నా. కానీ ఇవాళ షూటింగ్‌ పూర్తయిన తర్వాత, దాదాపు ఏడాది పాటు ఈ పాత్రలో జీవించిన తర్వాత నిజాయతీగా చెబుతున్నా.. చరిత్ర మిమ్మల్ని ఎప్పటికీ అపార్థం చేసుకోదు’ అని అనుపమ్ పేర్కొన్నారు. 
Manmohan singh
Sonia Gandhi
Anupam Kher
The Accidental Prime Minister

More Telugu News